ఆటో మోటార్ కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కిరణ్ – టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం
హైదరాబాద్, అద్దం న్యూస్ : కిరణ్ ఆటో మోటార్ కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం అన్నారు. వడ్లకొండ కిరణ్ ప్రధమ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్‌లో తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టియుసిఐ హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు జి.లింగం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో టియుసిఐ రాష్ట్ర ప్రధాన...