Addam News
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 4:05 pm Posted by : Addam News

 కొలచిన వారికి కొంగుబంగారం వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయ స్వామి – టిపిసిసి అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్

 కొలచిన వారికి కొంగుబంగారం వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయ స్వామి
టిపిసిసి అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ :   నమ్మి కొలచిన వారికి కొంగుబంగారం వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయ స్వామి అని టిపిసిసి అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం వివేక్‌న‌గ‌ర్‌లో స్వయంభూ శ్రీ ఆంజనేయ స్వామి వారిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సతీసమేతంగా మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. వారికి పూర్ణకుంభస్వాగతం పలికి పూజలు జరిపి ఆలయ ముఖ్య అర్చకులు బుగ్గా లక్ష్మీపతి శర్మ, అర్చకులు కందాళ వేంకటాద్రి గారలు వేదాశీర్వచనం జరిపించారు. వారిని ఆలయ చైర్మన్ జానకీ సుధాకర్, ఈఓ మాచర్ల దేవనాథం, కమిటీ సభ్యులు నెల్లి శ్యామ్‌ కుమార్ ముదిరాజ్ లు ఘనంగా సన్మానించారు.

ఈ సంద్భంగా మ‌హేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… త‌న‌కు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంతో సుమారు 32 సంవత్సరాల నుండి అనుబంధం ఉన్నదని తెలిపారు. శ్రీ స్వామి వారు న్యాయ బద్ధమైన కోరికలు తీర్చే కొంగుబంగారు దైవమన్నారు. కాంచనాద్రి కమనీయ విగ్రమనీ, తన అనుభవాలను తెలుపుతూ పునర్నిర్మాణ సమయంలో తన వంతు కృషి చేస్తానని సంకల్పించుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడున్న పునర్నిర్మాణ కమిటీ చాలా మంచి అభివృద్ధి పనులు చక్కగా చేస్తున్నారని అభినందిస్తూ, కమిటీ చైర్మ‌న్‌ జానకీ సుధాకర్, ఈఓ మాచర్ల దేవనాథం లు ప్రతిపాదించిన దేవాలయ కల్యాణ మండపాన్ని సుమారు 25 లక్షలతో సుందరీకరిస్తానని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసి తనకు పంపమని మ‌హేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అరవింద్ కుమార్ యాదవ్‌, శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం చైర్మ‌న్ మారిశెట్టి న‌ర్సింగ్‌రావు, మాజీ తెలంగాణ కార్మిక వేతన సంఘం చైర్మన్ నాగభూషణం, డివిజన్ కాంగ్రెస్ నాయకులు జ‌యేంద‌ర్ బాబు, బంటారం యాద‌గిరి గౌడ్‌, జ‌గ‌దీష్ బాబు, పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png