Addam News
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 2:01 am Posted by : Addam News

బీజేపీ లేబర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కృష్ణ గౌడ్ నియామకం

రామచందర్ రావు చేతుల మీదుగా నియామక పత్రం అందజేత..
అభినందించిన బీజేపీ నాయకులు

తార్నాక, న‌వంబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :   

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ కార్యవర్గ సభ్యుడిగా కృష్ణ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ ఆండే శ్రీనివాస్, మహంకాళి జిల్లా ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీరామ్ వెంకట్ కృష్ణ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, కార్మికుల అభ్యున్నతితో పాటు పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కృష్ణ గౌడ్ ముందుకు సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.