ఏసిబి విచారణకు హాజరైన కెటిఆర్ – లుచ్చా పని చేసి అడ్డంగా దొరికిన రేవంత్, బీఆర్ఎస్ నేతలను ఎలాగైనా జైలుకు పంపాలన్న శాడిస్ట్ ఆలోచనతో ఉన్నాడు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ బ్యూరో, జూన్ 16, అద్దం న్యూస్ : ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎసిబి విచారణ సోమవారం పూర్తైంది. కెటిఆర్‌ను సుమారు ఎనిమిది గంటల పాటు ఏసిబి అధికారులు ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు విచారణలో కెటిఆర్ సెల్‌ఫోన్ సీజ్ చేసేందుకు ఏసిబి అధికారులు ప్రయత్నించారు. అయితే ఇవాళ విచారణకు సెల్‌ఫోన్ తీసుకురాలేదని కెటిఆర్ అధికారులకు తెలిపారు. ఈ-కార్ రేసింగ్ సమయంలో వాడిన సెల్‌ఫోన్లు అప్పగించాలని ఏసిబి అధికారులు...