Addam News
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 5:32 am Posted by : Addam News

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కూచిపూడి గురువు వినీలరావ్‌ బృందం నృత్య ప్రదర్శన

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కూచిపూడి గురువు వినీలరావ్‌ బృందం నృత్య ప్రదర్శన

తిరుమ‌ల‌, అక్టోబ‌ర్ 2, అద్దం న్యూస్ :   తిరుమలలో శ్రీవారి సన్నిధిలో హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌బీ కూచిపూడి కళానిలయం నుంచి కూచిపూడి గురువు వినీలరావ్‌ బృందం నృత్య ప్రదర్శన ఇచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరడ సేవ రోజు మాడవీధుల్లో కూచిపూడి నృత్య నీరాజనం చేశారు. మూల విరాట్‌కు అలంకరించే సాలగ్రామహారం, లక్ష్మీహారం, మకర అమూల్య ఆభరణాలతో గరుడ వాహనంపై ఆ దేవాదేవుడి ఊరేగింపు కన్నుల పండువగా జరిగిందని కూచిపూడి గురువు వినీలరావ్‌ అన్నారు. గరుడ సేవలో స్వామివారిని దర్శించుకుంటే మూలవిరాట్‌ దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకమని.. అలాంటిది తమ బృందంతో శ్రీవారి ముందు నృత్య ప్రదర్శన ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png