నషా ముక్త్ భారత్ – నషా ముక్త్ తెలంగాణ అభియాన్‌కు శ్రీకారం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 3, ( అద్దం న్యూస్ ) :    అల‌య్‌-బ‌ల‌య్ ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి అధ్యక్షతన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబుల్లా ఖాన్ హాల్‌లో నషా ముక్త్ భారత్ – నషా ముక్త్ తెలంగాణ అభియాన్ కార్యక్రమం జ‌రిగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వ్యసనం దేశ యువత భవిష్యత్తును, కుటుంబ వ్యవస్థను, సమాజ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన...