Addam News
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 4:23 am Posted by : Addam News

జస్టిస్ గవాయ్‌ పై బూటుతో దాడికి ప్రయత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి – ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్ డిమాండ్

జస్టిస్ గవాయ్‌ పై బూటుతో దాడికి ప్రయత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి

– ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్ డిమాండ్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 12, అద్దం న్యూస్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌ పై బూటుతో దాడికి ప్రయత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్‌పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు పొట్ట‌పెంజ‌ర ర‌మేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను అవమాన పరచడం క్షమించరాని నేరమన్నారు. చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన‌ వ్యక్తి దేశ ద్రోహితో సమానమని.. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జస్టిస్ గవాయ్‌ ఒక దళితుడని మనువాద ముసుగులో సనాతన ధర్మం అంటూ మనువాదులు దాడి చేశార‌ని అన్నారు. దేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దిశగా దేశ పౌరులందరూ ఒక తాటి మీదకు వచ్చి చీఫ్ జ‌స్టిస్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఎంఆర్‌పిఎస్ టిఎస్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామ‌ని హెచ్చరించారు. ఈ స‌మావేశంలో ప‌లువురు ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png