Addam News
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 4:45 am Posted by : Addam News

ఆలె న‌రేంద్ర చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన నేత‌లు

ఆలె న‌రేంద్ర చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన నేత‌లు

హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ :    మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత టైగర్ ఆలె నరేంద్ర వర్ధంతి కార్య‌క్ర‌మం గురువారం జ‌రిగింది. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌రేంద్ర చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా విన‌య్ మాట్లాడుతూ… మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత టైగర్ ఆలె నరేంద్ర జనసంఘ్ నేతగా.. బిజెపి నాయకుడిగా.. తెలంగాణ ఉద్యమ నేతగా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సాగించిన వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, బాలకృష్ణ, మహమూద్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, సాయికుమార్, నీరజ్, లావణ్య, సంయుక్తా రాణి, అనూష, పద్మశాలి సంఘం సభ్యులు రాచ శ్రీనివాస్, వెంకటేష్, రఘునాథ్, పాపయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png