అమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేద్దాం – నటుడు డాక్టర్.మాదాల రవి
హైదరాబాద్, అద్దం న్యూస్ : అమర వీరుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేద్దామని నటుడు, నిర్మాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్.మాదాల రవి అన్నారు. జీవితంలో రెండు దానాలు గొప్పవని అన్నదానం.. రక్తదానం అని.. మొదటిది సాటి మనిషి కడుపు నింపితే...రెండవది సాటి మనిషి ప్రాణాలు నిలబెడుతుందన్నారు. భగత్‌సింగ్ వర్థంతి సందర్భంగా ఆదివారం ఎల్‌బినగర్ చింతలకుంట వాసవీ శ్రీ నిలయంలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం, అమర వీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ...