Addam News
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 2:02 pm Posted by : Addam News

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్.కె.ల‌క్ష్మ‌ణ్

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి
– రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్.కె.ల‌క్ష్మ‌ణ్

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :   చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్య‌క్ర‌మం తెలంగాణ రజక ధోబి అభివృద్ధి సంస్థ గ్రేటర్‌ హైదరాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో హైద‌రాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌రై ఐల‌మ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… నైజాం పాలనలో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ ధైర్యంగా పోరాడారని, ఆమె పోరాట స్ఫూర్తి తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. సెప్టెంబరు 10 నుంచి 17 వరకు నిర్వహించే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం.నరసింహ, రాష్ట్ర సలహాదారులు ఎం. గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సి.చంద్రమోహన్, ఆందోల్ సాయి, సత్యనారాయణ, శ్రీనివాస్, కుమార్, సుదర్శన్ స‌భ్యులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png