భగత్‌సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నవ సమాజాన్ని నిర్మిద్దాం
హైదరాబాద్, అద్దం న్యూస్ : భగత్‌సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నవ సమాజాన్ని నిర్మిద్దామని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.అబ్బాస్ అన్నారు. సుందరయ్య విజ్ఞానకేంద్రం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 94 వ వర్ధంతి సందర్భంగా బాల భగత్‌సింగ్ లంతా వేషధారణతో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. భగత్‌సింగ్ బాటలో బాలలం మేమంతా భావిపౌరులం ఉత్తుంగ తరంగాలం - ఉద్దండ పిండాలం.. కులం లేదు.. మతం వద్దు.. సమానత్వమే సరిహద్దుగా సాగుదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం...