Addam News
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 7:40 am Posted by : Addam News

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం – మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్ గౌడ్‌

చిక్క‌డ‌ప‌ల్లి, న‌వంబ‌ర్ 22, ( అద్దం న్యూస్ ) :    పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామ‌ని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ అన్నారు. ఆదివారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో జిహెచ్ఎంసి ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ ( బీఓపీవీ ) అందించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… నేటి బాలలే రేపటి పౌరులు.. వారి భవిష్యత్తును అంధకారం చేసే మహమ్మారి పోలియో అని అన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రులు బాధ్యతగా భావించాలని కోరారు. పిల్లల ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధే రేపటి సమాజానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, మనందరి సామాజిక బాధ్యత అని అన్నారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకుండా చూడాలని అభిప్రాయ‌ప‌డ్డారు.