పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం – మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్ గౌడ్
చిక్కడపల్లి, నవంబర్ 22, ( అద్దం న్యూస్ ) : పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్ గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ ( బీఓపీవీ ) అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నేటి బాలలే రేపటి పౌరులు.. వారి భవిష్యత్తును అంధకారం చేసే మహమ్మారి...