ప్రకృతి వైవిధ్యాన్ని, వైద్యాన్ని అభివృద్ధి చేసుకుందాం. అడవులను, ఆదివాసులను కాపాడుకుందాం – ప్రకృతి – ఆరోగ్య రాష్ట్ర మహాసభలో ప్రకృతికవి జయరాజు పిలుపు

ఉస్మానియా యూనివ‌ర్శిటి, మే 25, అద్దం న్యూస్ :  అడవిని అంటిపెట్టుకుని, అడవిని పరిరక్షిస్తున్న ప్రకృతి ప్రేమికులైన ఆదివాసుల హననం దారుణమ‌ని, ప్రాచీన కాలం నుండి వారసత్వంగా వస్తున్న ప్రకృతి వైవిధ్యాన్ని, వైద్యాన్ని అభివృద్ధి చేసుకుందాం. అడవులను, ఆదివాసులను కాపాడుకుందామ‌ని ప్రకృతి - ఆరోగ్య రాష్ట్ర మహాసభలో ప్రకృతికవి జయరాజు పిలుపునిచ్చారు. 40 రోజులుగా ఆహార దీక్షల ముగింపు సందర్భంగా ఆదివారం హైద‌రాబాద్ ఉస్మానియా యూనివ‌ర్శిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలోని ఈసీఈ ఆడిటోరియంలో ప్రకృతి ఆరోగ్య మహాసభను నిర్వహించారు. సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు, ప్రకృతి...