Addam News
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 1:51 am Posted by : Addam News

తెలంగాణ గడ్డమీద బహుజన రాజ్యం స్థాపిద్దాం

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ గడ్డమీద బహుజన రాజ్యం స్థాపిద్దామ‌ని ప‌లువురు సామాజిక తత్వవేత్త ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర అన్నారు. హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ప్రముఖ పర్యావరణవేత్త బహుజన ఉద్యమకారుడు ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యుడు బిఎస్‌పి పార్టీ తెలంగాణ రాష్ట్రం సెంట్రల్ కో– ఆర్డినేటర్‌గా నియమితులైన ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ సభ్యులు దాగిల్ల దయానందరావు అభినందన సభ డాక్టర్ సిహెచ్ భద్ర ఆధ్వ‌ర్యంలో శ‌క్ర‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సంస్థ సలహాదారులు గ్రాండ్ మాస్టర్ గల్లా ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో బహుజనవాదం ఒక అగ్నిపర్వతంలాగా బద్దలు కొడుతూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కీలక సమయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం మాన్యశ్రీ కాన్షిరామ్ ఈ దేశంలో ఎవరూ చేయలేనని త్యాగాలు చేసి బహుజన సమాజాన్ని తన కుటుంబంగా భావించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన మహోన్నత నాయకుడు ఆశయాలతో బీఎస్‌పి పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆశయాలను గత 30 సంవత్సరాలుగా నిరంతరం పని చేస్తున్నార‌న్నారు. తెలుగు రాష్ట్రాలలో బహుజన రాజ్యం రావాలని ముఖ్యంగా బీసీలు ముఖ్యమంత్రి పీఠం ఆదేశించాలని బిఎస్‌పి పార్టీ జెండా మోస్తూ పార్టీకి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత గొప్ప నాయకుడు దయానందరావు అని అన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సెంట్రల్ కోఆర్డినేటర్ గా నియమితులైన దయానందరావు మాట్లాడుతూ… నేను ఎప్పుడూ పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ముందు తీసుకెళ్లడానికే పని చేస్తానన్నారు. భవిష్యత్తులో యువత పెద్ద ఎత్తున బిఎస్‌పిలోకి రావాలని, తెలంగాణ గడ్డమీద మన బహుజన రాజ్యాన్ని స్థాపిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్తలు నిఖిల్, రిజ్వాన్, శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు లక్ష్మీనారాయణ, రాజేష్, ప్రశాంత్ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png