దేశంలో విద్యా రంగంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం – జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వీపీ సాను, మయుక్ బిస్వాస్

హైదరాబాద్, జూన్ 7, అద్దం న్యూస్ :   దేశంలో విద్యారంగంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదామ‌ని, నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థులపై నరేంద్ర మోడీ ఫీజుల దాడి చేస్తున్నార‌ని జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వీపీ సాను, మయుక్ బిస్వాస్ లు అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య‌విజ్ఞాన‌కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ సమావేశాలకు సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వీపీ సాను మయుక్ బిస్వాస్ మాట్లాడుతూ... దేశంలో...