Addam News
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 7:30 am Posted by : Addam News

Air crash: కూలిన ప్రైవేట్‌ జెట్‌.. సైన్యాధ్యక్షుడు మృతి

Air crash: కూలిన ప్రైవేట్‌ జెట్‌.. సైన్యాధ్యక్షుడు మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అంకారాలో ఓ ప్రైవేట్‌జెట్‌ (Air crash) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో లిబియా సైన్యాధ్యక్షుడు (Libyan military chief) అలీ ఉన్నారు. ఈ ఘటనలో సైన్యాధ్యక్షుడితోపాటు నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. రన్‌వేపై నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే విమాన ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సైన్యాధ్యక్షుడి మృతిని లిబియా ప్రధానమంత్రి అబ్దుల్-హమీద్ ధ్రువీకరించారు.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి అలీతోపాటు మరో నలుగురు అధికారులతో ఫాల్కన్‌ 50 విమానం అంకారా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలు దేరింది. అనంతరం 42 నిమిషాలకు విమానంతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమాన శిథిలాలను అంకారాకు నైరుతి దిశలో గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png