Addam News
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 3:01 am Posted by : Addam News

జీవనశైలిలో మార్పులు అత్యవసరం

 

హైదరాబాద్, అద్దం న్యూస్  బీపీ, షుగర్ పేషెంట్లకు మందుల వాడకంతో పాటు, జీవనశైలిలో కూడా మార్పులు అవసరమని ప్రముఖ డాక్టర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నారని హెచ్‌సిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమ‌వారం హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (హైదరాబాద్ జిందాబాద్) ఆధ్వర్యంలో బాగ్‌లింగంప‌ల్లిలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బిపి- షుగర్ ఉచిత మెడికల్ క్యాంప్ కు ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్లను సన్మానించడం జరిగింది. డాక్టర్ రాజు, హెచ్‌సిఎఫ్ ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, డాక్టర్ నాగు ల‌ను హెచ్‌సిఎఫ్‌ ఉపాధ్యక్షులు మోహన్ నాయుడు శాలువా కప్పి సన్మానించి, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కె.వీరయ్య మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని, బడ్జెట్‌లో కేటాయింపులు కూడా తగిన విధంగా కేటాయించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ప్రజానీకం వైద్య సదుపాయాల కోసం, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. హెచ్‌సిఎఫ్‌ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా బీపీ – షుగర్ పేషెంట్లకు ఉచిత సేవలందిస్తున్నామని, ఇప్పటికి 102 నెలలలో, 102 క్యాంపులు పూర్తయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సిఎఫ్‌ నాయకులు పి.శ్రీనివాసరావు, మోహన్ నాయుడు, ఎం.శ్రీనివాసరావు, సంగీత, అస్మిత, నాగేష్, రాజమౌళి, సైదులు, సుకుమార్, గోపాల్, శంకర్, మహేందర్, శంకరయ్య, రమేష్, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png