జీవనశైలిలో మార్పులు అత్యవసరం
హైదరాబాద్, అద్దం న్యూస్ : బీపీ, షుగర్ పేషెంట్లకు మందుల వాడకంతో పాటు, జీవనశైలిలో కూడా మార్పులు అవసరమని ప్రముఖ డాక్టర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నారని హెచ్‌సిఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (హైదరాబాద్ జిందాబాద్) ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బిపి- షుగర్ ఉచిత మెడికల్ క్యాంప్ కు ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్లను సన్మానించడం జరిగింది. డాక్టర్ రాజు, హెచ్‌సిఎఫ్ ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, డాక్టర్ నాగు...