కోటి దీపాలు వెలిగించడం అంటే జగతికి వెలుగు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
హైదరాబాద్, నవంబర్ 19, ( అద్దం న్యూస్ ) : కోటి దీపాలు వెలిగించడం అంటే జగతికి వెలుగు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ ఎన్టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం గురువారం 6వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో భాగంగా శంఖారావం, వేదపఠనంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. శ్రీ గణపతి సచ్చిదానంద కళాపీఠం ఆధ్వర్యంలో భక్తిగీతాలు ఆలపించగా, రామ్మోహన్ బృందం సితార్, తబల వాద్య సమ్మేళనంతో అలరించింది....