అంగ‌న్‌వాడి పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన

అంగ‌న్‌వాడి పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన ముషీరాబాద్‌, ఏప్రిల్ 28, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్ అంగ‌న్‌వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సతీమణి జి.కావ్య రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌ల‌కు బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రప్రథమ విద్యను అందించడానికి అంగన్‌వాడి కేంద్రాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు...