Addam News
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 2:38 am Posted by : Addam News

ముషీరాబాద్ డిపో అధ్యక్షుడిగా ఎం.రాజేష్, గ్యారేజ్ సెక్రటరీగా దర్గా రఘువంశీ విజయం

ముషీరాబాద్‌, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) :

టిజిఎస్ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నిక‌ల్లో ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కూట‌మి ఘ‌నంగా విజ‌యం సాధించింది. ఇందులో భాగంగా ముషీరాబాద్ డిపోలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ తరఫున పోటీ చేసిన ఎం.రాజేష్ డిపో అధ్యక్షుడిగా, ఎంప్లాయీస్ యూనియ‌న్ త‌ర‌పున పోటీ చేసిన‌ దర్గా రఘువంశీ ముషీరాబాద్ డిపో గ్యారేజ్ సెక్రటరీగా విజయం సాధించారు. మొత్తం 573 ఓట్లు పోలవగా, అధ్యక్ష పదవికి పోటీ చేసిన రాజేష్‌కు 484 ఓట్లు, గ్యారేజ్ సెక్రటరీగా పోటీ చేసిన రఘువంశీకి 481 ఓట్లు లభించాయి. తమను గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపారు.