Addam News
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 6:40 am Posted by : Addam News

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కి 32 సంవత్సరాల ఉద్యమ చరిత్ర

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కి 32 సంవత్సరాల ఉద్యమ చరిత్ర
– ఎమ్మార్పిఎస్ నాయ‌కుడు పొట్ట పెంజర రమేష్

హైద‌రాబాద్‌, జూలై 7, ( అద్దం న్యూస్ ) :   మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కి 32 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉంద‌ని ఎమ్మార్పిఎస్ నాయ‌కుడు పొట్ట పెంజర రమేష్ అన్నారు. మంగ‌ళ‌వారం ఎమ్మార్పిఎస్ ఉద్య‌మ అమ‌ర‌వీరుల‌కు నివాళి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ర‌మేష్ హాజ‌రై ఉద్య‌మ అమ‌ర‌వీరుల విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ర‌మేష్ మాట్లాడుతూ… సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా 1994 జూలై 7న ప్రారంభమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( MRPS ) విజయవంతంగా 32 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందన్నారు. ఈ మూడు దశాబ్దాలకు పైగా కొనసాగిన ఉద్యమంలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, మహిళలు, యువత త్యాగాలు చేసి మాదిగ సమాజ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేశారని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో ఆందోళనలు, దీక్షలు, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చడంలో MRPS కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మాదిగ పల్లె, గ్రామం, పట్టణంలో MRPS ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటాలని పిలుపునిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png