తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా మైల్కోల్ మహేందర్ యాదవ్ – మార్క రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహేందర్ యాదవ్‌కు సన్మానం
హైదరాబాద్, సెప్టెంబర్ 20, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా మైల్కోల్ మహేందర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాదవ సంఘాల రాష్ట్ర నాయకులు, గ్రేటర్ హైదరాబాద్‌లోని 52 స్థానిక యాదవ్ సదరు ఉత్సవాల కమిటీ సభ్యులు అందరూ కలిసి మహేందర్ యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా నియమితులైన...