హైదరాబాద్, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) : మెగా గ్రాడ్యుయేట్ కన్‌క్లేవ్-2026 ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్ అన్నారు. పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, త్వరలో జరుగనున్న మెగా గ్రాడ్యుయేట్ కన్‌క్లేవ్-2026 కు సంబంధించి మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్ మాట్లాడుతూ… గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు, కాబోయే కాబోయే ఉద్యోగులకు ( Future Talent ) ఐటీ, ఇతర రంగాలలోని కంపెనీల హెచ్‌ఆర్ లీడర్లతో నేరుగా నెట్‌వర్కింగ్ చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) ప్రభావం, సరికొత్త ఉపాధి నైపుణ్యాల ( Future Skills ) పై మెగా గ్రాడ్యుయేట్ కన్‌క్లేవ్-2026 లో చర్చలు జరుగుతాయన్నారు.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు నిర్వహించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల ఈ నెల 28 వ తేదీ నుంచి నవంబర్ ఆరో తేదీ వరకు గ్రాడ్యుయేట్ ఓటరు ఎన్రోల్మెంట్ కార్య క్రమం ఉంటుందన్నారు. రాబోయే పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పట్టభద్రులు తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకునేలా వారిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా యూనివర్శిటీ నుంచి 2026 నవంబర్ 1వ తేదీ లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు తమ ఓటును నమోదు చేసుకోవచ్చన్నారు. పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png