జులై 9 న జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – కార్మిక వర్గానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ పిలుపు
హైదరాబాద్, జూన్ 15, అద్దం న్యూస్ : జులై 9 న జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ అన్నారు. ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం గోల్కొండ చౌరస్తాలో గల సిఐటియు నగర కార్యాలయంలో సిఐటియు ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు జరిగాయి. ఈ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై...