Addam News
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 5:46 am Posted by : Addam News

పివైఎల్‌ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయండి

విద్యాన‌గ‌ర్‌, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :    పివైఎల్‌ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాల‌ని పివైఎల్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోకాళ్ళ రమేష్, కోల లక్ష్మీనారాయణ లు కోరారు. ఆదివారం హైదరాబాద్ విద్యాన‌గ‌ర్‌ మార్క్స్ భవన్‌లో ప్రగతిశీల యువజన సంఘం ( పివైఎల్ ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మోకాళ్ళ రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం భవిష్యత్తు కార్యాచరణ, దేశంలో, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చించడం జరిగింది. ఈ సంద‌ర్భంగా పివైఎల్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోకాళ్ళ రమేష్, కోల లక్ష్మీనారాయణ లు మాట్లాడుతూ… నిరుద్యోగ సమస్య, ఉద్యోగ ఉపాధి సమస్యలు, గంజాయి, డ్రగ్స్, మద్యం అనేకరకాల యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం డిసెంబర్ 27, 28న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగు ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ రాష్ట్ర మహాసభలను జరుపుకుంటున్నామని తెలిపారు. 

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవలంబిస్తున్న ప్రజా నిరుద్యోగ వ్యతిరేక సమస్యలపై గళమెతి ఉద్యమించిందని, విద్యా రంగంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న మతతత్వ విధానాలను ఖండించి అనేక ఉద్యమాలను నిర్వహించిందని తెలిపారు. ఈ మహాసభలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పివైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొర్రెపాటి రమేష్, వనమాల సత్యం, మామిడి పరుశురాం, సహాయ కార్యదర్శి సిద్దేశ్వర్, కోశాధికారి డి.రవి, సభ్యులు బండి రవి, మనోహర్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.