తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి  -అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

తెలంగాణ బ్యూరో, అక్టోబర్ 27, ( అద్దం న్యూస్ ) :ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించే కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్ ఈవెంట్లపై ఈ సందర్భంగా...