అక్టోబర్ 10 న జరుగనున్న‌ ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి

బాగ్‌లింగంప‌ల్లి, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) :   అక్టోబర్ 10 న జరుగుతున్న ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయాల‌ని గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఠానూ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎం.ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనం జ‌రిగింది. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10, 11...