Addam News
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 7:31 am Posted by : Addam News

ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా బ్లాస్టింగ్ పోస్టర్‌ రిలీజ్!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా సంక్రాంతికి రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ఆకట్టుకున్నాయి. ప్రచారంలో భాగంగా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చిరు పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ట్రైలర్ లాంచ్ అప్డేట్ ను మేకర్స్ అందించారు.

‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా నుంచి ఇప్పటివరకూ రిలీజైన టైటిల్ గ్లింప్స్, మూడు పాటలు, ఇతర పోస్టర్లు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే టీజర్ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. అయితేనేం టీజర్ ఇవ్వకపోయినా, నేరుగా ట్రైలర్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయింది. జనవరి 5వ తేదీన ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయింది.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png