మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి – మారేడుమిల్లి అడవుల్లో ఎదురుకాల్పులు
అల్లూరి సీతారామరాజు, నవంబర్ 17, అద్దం న్యూస్ : అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్తు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందారు. మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య మంగళవారం ఉదయం 6 నుంచి ఏడు గంటల వరకు ఎదురు కాల్పులు జరిగాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య రాధ మృతి చెందారు....