Addam News
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 3:05 am Posted by : Addam News

గాంధీ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన మారిశెట్టి న‌ర్సింగ్‌రావు

ముషీరాబాద్‌, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో శుక్ర‌వారం గాంధీ జ‌యంతి కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శ సికింద్రాబాద్ జిల్లా మారిశెట్టి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో గాంధీనగర్ డివిజన్‌లోని కెనరా బ్యాంక్ వద్ద జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం పేద‌ల‌కు పండ్లను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మారిశెట్టి న‌ర్సింగ్‌రావు మాట్లాడుతూ… గాంధీజీ కలలు కన్న ‘ గ్రామ స్వరాజ్యం ‘ సాకారమైనప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, కుటీర పరిశ్రమల ప్రోత్సాహం, ఆర్థిక స్వావలంబన కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. అలాగే, ‘ పరిశుభ్రత దేవునికి సమానం ‘ అని నమ్మి స్వచ్ఛతకు పునాది వేశారని… ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, మనమంతా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం శాతనారాయణ, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు సాయి కీర్త్ బాబ్జి, నాయ‌కులు సురేష్ యాదవ్, జగదీష్ బాబు, పాశం అనిల్ యాదవ్, బాబురావు, నవీన్, భీమన, వెంకట్రమణ, సాయి రామ్, బ్రహ్మం, భాస్కర్ రెడ్డి, రాజు, జగ్గు, ప్రభు, శంకర్ గౌడ్, కవిత, సలీం, చందు పాల్గొన్నారు.