గాంధీ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన మారిశెట్టి న‌ర్సింగ్‌రావు

ముషీరాబాద్‌, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో శుక్ర‌వారం గాంధీ జ‌యంతి కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శ సికింద్రాబాద్ జిల్లా మారిశెట్టి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో గాంధీనగర్ డివిజన్‌లోని కెనరా బ్యాంక్ వద్ద జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం పేద‌ల‌కు పండ్లను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మారిశెట్టి న‌ర్సింగ్‌రావు మాట్లాడుతూ... గాంధీజీ కలలు కన్న ' గ్రామ...