Addam News
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 2:56 pm Posted by : Addam News

తెలంగాణ సిద్ధాంతక‌ర్త జ‌య‌శంక‌ర్ సార్‌కు నివాళుల‌ర్పించిన మారిశెట్టి న‌ర్సింగ్‌రావు

తెలంగాణ సిద్ధాంతక‌ర్త
జ‌య‌శంక‌ర్ సార్‌కు నివాళుల‌ర్పించిన మారిశెట్టి న‌ర్సింగ్‌రావు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 6, ( అద్దం న్యూస్ ) :  కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త‌, మాజీ ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ప్ర‌ధాన రోడ్డు మార్గంలో గ‌ల జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు జ‌య‌శంక‌ర్ సార్ తెలంగాణ కోసం పాటుప‌డ్డార‌న్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహ‌ర్నిష‌లు కృషి చేశార‌ని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు గుండు జ‌గ‌దీష్ బాబు, చందు, అభిషేక్‌, ముర‌ళీ, భాస్క‌ర్ రెడ్డి, శ్రీనివాస్‌, మ‌జ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png