Addam News
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 7:07 am Posted by : Addam News

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా మారిశెట్టి న‌ర్సింగ‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 12, అద్దం న్యూస్ :     కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం చైర్మ‌న్‌ మారిశెట్టి న‌ర్సింగ‌రావు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న నియామ‌కాన్ని సికింద్రాబాద్ డిసిసి అధ్య‌క్షుడు దీపక్ జాన్ ప్ర‌క‌టించారు.   ఈ సంద‌ర్భంగా మారిశెట్టి న‌ర్సింగ‌రావు మాట్లాడుతూ… త‌న పై న‌మ్మ‌కంతో త‌న‌ను సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించినందుకుగాను మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌, డిసిసి అధ్య‌క్షుడు దీప‌క్ జాన్ ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png