మనస్థాపంతో భవనం పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్, అద్దం న్యూస్ : భర్త, అత్తింటివారు వేధిస్తున్నారనే మనస్థాపంతో భవనం పై నుండి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ రాంబాబు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ కు చెందిన మల్లేశ్, పుష్పలత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య (26)ను నాలుగు నెలల క్రితం మూసాపేటకు చెందిన శబరీష్ కు ఇచ్చి వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా సౌజన్య గుండెకు రంధ్రం ఉందనే విషయాన్ని దాచిపెట్టి...