Addam News
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 6:12 am Posted by : Addam News

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం (Japan Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైందని అధికారులు వెల్లడించారు. హొక్కైడో ద్వీపానికి, అమోరి ప్రాంతానికి సమీపంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. శక్తిమంతమైన ప్రకంపనల కారణంగా అమోరి, హొక్కైడో తీరాల్లో 3 మీటర్ల (10 అడుగుల వరకు) వరకు సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించారు.

భూకంపం సంభవించిన కొద్దిసేపటికే హొక్కైడోలోని ఉరకావా, అమోరిలోని ముత్సు ఒగవారా తీరాల్లో 40 సెంటీమీటర్ల మేర సునామీ అలలు తాకినట్లు అధికారులు వెల్లడించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు అత్యవసర టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని సనాయె తకాయిచి మీడియాకు వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. విపత్తు ధాటికి హచినోహే పట్టణంలోని ఓ హోటల్‌లో పలువురు గాయపడినట్లు సమాచారం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png