గచ్చిబౌలిలో భారీ చోరి – నగల వ్యాపారుల దృష్టి మరల్చి అర కిలో బంగారం చోరీ 

హైదరాబాద్, అద్దం న్యూస్ : గచ్చిబౌలి పీఎస్ పరిధిలో భారీ చోరి జరిగింది. గోల్డ్ కాయిన్స్ ఉన్నాయంటూ ఇద్దరు నగల వ్యాపారులను దుండగులు పిలిపించారు. ఇద్దరు నగల వ్యాపారులు గోల్డ్ కాయిన్స్ ను చూస్తుండగా వారి దృష్టి మరల్చిన దుండగులు అర కిలో బంగారంతో పాటు 18 వేల యూఎస్ డాలర్స్ ఉత్తుకెళ్ళారు. బాధితులు నార్సింగికి చెందిన చంద్రశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.