మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలి – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
కరీంనగర్, అద్దం న్యూస్ : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వేములవాడలోని మున్నూరుకాపు సంఘం భవన్ లో టీడబ్ల్యూజేఎఫ్ వేములవాడ నియోజకవర్గం మహాసభ జరిగింది. ఈ మహాసభలో మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు మీడియాలో వస్తున్న అనారోగ్యకర భాష నియంత్రణకు మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని ఆయన...