యుపిహెచ్‌సిల‌లో వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలి – ఐద్వా

హైదరాబాద్, జూన్  24, అద్దం న్యూస్ :   గ్రేటర్ హైదరాబాదు జిల్లా పరిధిలోని యుపిహెచ్‌సిల‌లో వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలని ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.పద్మ, వై.వరలక్ష్మీ, సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మిలు కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వారు హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాదు జిల్లా పరిధిలో మొత్తం 93 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ( యుపిహెచ్‌సి ) లు ఉన్నాయని,...