Addam News
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 6:51 am Posted by : Addam News

ఆ రెండు సినిమాలు రీమేక్ చేయాలని ఉంది: Megastar Chiranjeevi

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీకి కొన్నేళ్లు దూరంగా ఉండి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం తన కెరీర్ పట్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా’, ‘ఆచార్య’ వంటి సీరియస్ రోల్స్ చేసిన తర్వాత తనలోని అసలైన కామెడీ టైమింగ్ మిస్ అయ్యిందని అభిప్రాయపడ్డారు.

తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘దొంగ మొగుడు’ (Donga Mogudu), ‘రౌడీ అల్లుడు’ (Rowdy Alludu) చిత్రాలను రీమేక్ చేయాలని ఉందని ఆయన మనసులో మాట బయటపెట్టారు. ఈ చిత్రాల్లో ఉన్న వినోదం, మాస్ ఎలిమెంట్స్ ప్రస్తుత తరానికి కూడా బాగా కనెక్ట్ అవుతాయని ఆయన (Megastar Chiranjeevi) భావిస్తున్నారు. ముఖ్యంగా తనలో ఉన్న కామెడీ యాంగిల్‌ను, అల్లరిని మళ్ళీ అలాంటి పాత్రల ద్వారానే బయటకు తీయగలనని పేర్కొన్నారు.

ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Sankara Varaprasad Garu) అనే చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ (Megastar Chiranjeevi) మార్క్ కామెడీని చూస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png