Addam News
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 4:37 pm Posted by : Addam News

మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లలో అపశృతి – విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

 

 మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లలో అపశృతి 

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

హైద‌రాబాద్‌, మే 2, అద్దం న్యూస్ :    మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి చెందాడు. ఈ నెల 7 నుంచి 31వ తేదీ వ‌ర‌కు 28 రోజుల పాటు విశ్వ సుంద‌రి పోటీల‌కు హైద‌రాబాద్ వేదికైన సంగ‌తి తెలిసిందే. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల ఏర్పాట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది. ఇందులో భాగంగా శుక్ర‌వారం మిస్ వ‌ర‌ల్డ్ పోటీల ఓపెనింగ్ వేడుక‌ను గ‌చ్చిబౌలి స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఏర్పాట్ల‌ల్లో భాగంగా శుక్ర‌వారం గ‌చ్చిబౌలి స్టేడియం ఫ్లైఓవ‌ర్ ద‌గ్గ‌ర విద్యుత్ ప‌నుల‌ను చేప‌డుతుండ‌గా ఓ యువ‌కుడికి విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ త‌గిలి స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుడు ఎవ‌రు… ఎక్క‌డి నుంచి వ‌చ్చి ఇక్క‌డ ప‌ని చేస్తున్నాడు త‌దిత‌ర విష‌యాలు తెలియాల్సి ఉంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png