ప్రపంచ సుందరి పోటీలను రద్దు చేయాలి – ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి
హైదరాబాద్, అద్దం న్యూస్ : పెట్టుబడిదారుల మార్కెట్ ప్రయోజనాల కోసం ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ సుందరి పోటీలను రద్దు చేయాలని, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి వీరనారి ఐలమ్మ ట్రస్ట్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ మాట్లాడుతూ... ప్రపంచ సుందరి పోటీలను మే 7న...