హైదరాబాద్, అద్దం న్యూస్ : పవిత్ర రంజాన్ పండుగ సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని ప్రసిద్ధి చెందిన మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన రంజాన్ పండుగలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఖదీర్ ఆధ్వర్యంలో అడిక్‌మెట్ డివిజన్‌లో జరిగిన రంజాన్ వేడుకలకు ఎమ్మెల్యే గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఖదీర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షీర్ ఖుర్మా తినిపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ జహంగీర్, ప్రభాకర్, వల్లాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png