కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

ముషీరాబాద్, అక్టోబర్ 15, ( అద్దం న్యూస్ ) :  హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ లో నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు, స్వాతంత్ర్యోద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం 1969లోనే ప్రథమ దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు, నాటి మంత్రివర్గంలో కీలకమైన పదవిలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా...