కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను అందించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, ( అద్దం న్యూస్ ) : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చేయూత కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ సోమవారం ప్రారంభించారు. సీతాఫలమండీలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని కొత్త పింఛనుదారులకు మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ... 2014 సంవత్సరానికి ముందు కాలంలో తొలుత సికింద్రాబాద్ నియోజకవర్గం చాలీ...చాలని పింఛన్ల డబ్బులకు కార్యాలయాల చుట్టు తిరుగుతూ...