కోదాడ పట్టణ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్ష

కోదాడ, న‌వంబ‌ర్ 6, ( అద్దం న్యూస్ ) :  కోదాడ పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి శుక్రవారం కోదాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి పట్టణంలో కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు, మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులు, నిర్మాణంలో...