నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుండి మల్కా కొమురయ్య గెలుపు
నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గెలుపు కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుండి మల్కా కొమురయ్య విజయం మల్కా కొమురయ్యకు మద్దతు పలికిన బీజేపీ తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ, బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎన్నికల్లో మల్కా కొమురయ్య విజయం సాధించారు. మల్కా కొమురయ్యకు బీజేపీ మద్దతు పలికింది. శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను...