Addam News
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 9:56 pm Posted by : Addam News

పూర్వ ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి ని పరామర్శించిన ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

 

సిటీ కల్చరల్, ఏప్రిల్ 19, అద్దం న్యూస్ :  మోకాలి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కెవి.రమణాచారి ని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్‌లోని రమణాచారి నివాసానికి వెళ్లిన కవిత శాస్త్ర చికిత్స అనంతరం ఆయ‌న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా కెవి.ర‌మ‌ణాచారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత వెంట జాగృతి నాయకులు నవీన్ ఆచారి, బిఆర్ఎస్ నాయకుడు ఆలకుంట హరి త‌దిత‌రులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png