చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి ఎమ్మెల్సి కవితకు లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, జూన్ 27, అద్దం న్యూస్ : భారత దేశంలో ఒక పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి తెలంగాణ జాగృతి కవితకు లేదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. బనకచర్ల వ్యవహారంపై స్పందిస్తూ మాట్లాడిన కవిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... లిక్కర్ స్కాములో తెలంగాణ పరువు తీసి తీహార్ జైలులో చిప్పకూడు తిన్న కవిత...